Ravi Teja | ప్రస్తుతం ‘మాస్ జాతర’ షూటింగ్లో బిజీగా ఉన్నారు రవితేజ. కథానాయికగా శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. సినిమాను మేలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇదిలావుంటే.. రవితేజ చేయబోయే సినిమాల లిస్ట్‌లో ఓ ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చి చేరినట్టు తెలుస్తున్నది.
రామ్‌తో ‘నేను శైలజ’, సాయిదుర్గతేజ్‌తో ‘చిత్రలహరి’ చిత్రాలను తెరకెక్కించి, విజయాలను అందుకున్న సెన్సిబుల్ డైరెక్టర్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటించనున్నారట. ఇటీవలే రవితేజకు కిషోర్ ఓ ఆసక్తికరమైన కథను వినిపించారట. రవితేజకు కూడా ఆ కథ బాగా నచ్చిందని తెలుస్తున్నది. ఈ వేసవి నుంచే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు ఫిల్మ్ వర్గాల టాక్. ఈ సినిమాను నిర్మించే నిర్మాణ సంస్థ, ఇతర వివరాలు తెలియాల్సివుంది.