K Vijaya Bhaskar | కొన్ని సినిమాలు హిట్ అవుతాయని అనుకుంటాం. కానీ అనుకోకుండా అవి ఫ్లాప్ అవ్వడమే కాకుండా డిజాస్టార్‌గా మిగులుతాయి. అయితే ఆ సినిమాను దర్శకుడు సరిగ్గా తీయలేకపోవడం వలనో.. లేదా దర్శకుడు బాగా తీసిన ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక పోవడం వలన ఫ్లాప్ అవుతుంటాయి. అయితే తాను దర్శకత్వం వహించిన జై చిరంజీవ కూడా ఈ కోవలోకే వస్తుంది అన్నాడు సినీయర్ దర్శకుడు కే. విజయ్ భాస్కర్.
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కే. విజయ్ భాస్కర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘నువ్వే కావాలి’, ‘మన్మథుడు’, ‘నువ్వు నాకు నచ్చావ్’, మల్లీశ్వరి లాంటి ఆల్‌టైమ్ ఫ్యామిలీ బ్లాక్బస్టర్లను టాలీవుడ్‌కు అందించాడు. ఇక చాలారోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న విజయ్ భాస్కర్ తన కొడుకు కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టిన విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘ఉషాపరిణయం’ (Usha parinayam). లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా ఆగష్టు 02న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గోన్న విజయ్ భాస్కర్ తన దర్శకత్వంలో వచ్చిన జై చిరంజీవ ఆసక్తికర కామెంట్లు చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి, భూమిక చావ్లా, సమీరా రెడ్డి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం జై చిరంజీవ. అంజి వంటి భారీ డిజాస్టార్ తర్వాత మెగాస్టార్ హీరోగా ఈ సినిమా రావడంతో మూవీపై భారీ అంచానలు ఉన్నాయి. అయితే విడుదలైన రోజు నుంచే మిక్స్డ్ టాక్ రావడంతో మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే ఈ సినిమాలో తాను చేసిన ఒక ప్రయోగం బెడిసికొట్టిందని దర్శకుడు విజయ్ భాస్కర్ వెల్లడించారు.
సినిమా సోల్ (Movie Sole) అనేది దర్శకుడు కరెక్ట్‌గా చెప్పకపోతే.. అది మిస్‌ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. జై చిరంజీవ సినిమా విషయంలో జరిగింది అదే. అందులో ఉన్న సోల్‌ని నేను కరెక్ట్‌గా చెప్పలేకపోయాను. నేను ఒక కొత్త రకం ప్రయోగం చేశాను. నా వేలో కొత్తగా మాస్‌తో పాటు హ్యూమర్, సెంటిమెంట్, ఇలా అన్ని కలిపాను. ఒక మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి గారికి ఇది బెడిసికొట్టింది. ఫ్లాష్‌బ్యాక్ వలన కూడా మూవీకి చాలా పెద్ద మైనస్ అయ్యింది. కథను సూటిగా చెబితే బాగుండేది. కోడలు చనిపోయిందని అంత బాధలో ఉన్న హీరో అంతా కామెడీ చేయడం ప్రేక్షకులకు నచ్చలేదు. కానీ సినిమా చాలా బాగా వచ్చింది. అశ్వనీదత్, మెగాస్టార్ చాలా సపోర్ట్ చేశారు ఈ మూవీకి అంటూ విజయ్ భాస్కర్ వెల్లడించాడు.
Also Read..
Jagan illegal assets | జగన్ అక్రమాస్తుల కేసు నవంబర్ 11కు వాయిదా
IND vs SL | ఫెర్నాండో హాఫ్ సెంచరీ.. 25 ఓవర్లకు లంక స్కోర్..?