సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఫ్యామిలీ ఆడియెన్స్ చూడటానికి అంతగా ఇష్టపడరు. కానీ ‘ఫియర్’ అందుకు భిన్నంగా అందరూ చూసేలా ఉంటుంది’ అని చెప్పారు దర్శకురాలు డా॥ హరిత గోగినేని. ఆమె దర్శకత్వంలో వేదిక ప్రధాన పాత్రలో నటించిన ‘ఫియర్’ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో డా॥ హరిత గోగినేని పాత్రికేయులతో మాట్లాడుతూ ‘మూడేళ్ల క్రితం ఈ సినిమా ఆలోచన మొదలైంది.
‘భయం’ గురించిన కాన్సెప్ట్ కాబట్టే అదే టైటిల్‌గా పెట్టాలనుకున్నాం. అయితే అన్ని భాషలకు రీచ్ అయ్యేలా ‘ఫియర్’ టైటిల్‌ను ఎంచుకున్నాం. ఈ సినిమా వివిధ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో 70కిపైగా అవార్డులను గెలుచుకుంది. తెలుగులో విడుదలైన తర్వాత మిగతా భాషల్లో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పింది.
యూనివర్సల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశామని, రెగ్యులర్ సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు భిన్నంగా ఉంటుందని హరిత గోగినేని పేర్కొంది. చిన్న చిత్రాలకు కంటెంట్ ప్రధానమని, అదే ఉద్దేశంతో నిజాయితీగా ఈ సినిమాను తెరకెక్కించామని, త్వరలో ఓ యాక్షన్ మూవీతో పాటు కామెడీ ఎంటర్టైనర్కు ప్లాన్ చేస్తున్నామని హరిత గోగినేని చెప్పింది.