తొలి ప్రయత్నం ‘మళ్లీ రావా’తో ఆడియన్స్ని మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించిన ఘనత దర్శకుడు గౌతమ్ తిన్ననూరిది. ‘జెర్సీ’తో ద్వితీయ విఘ్నాన్ని కూడా అధిగమించి, బాక్సాఫీస్ వసూళ్లతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారాయన. ఇదే కథతో బాలీవుడ్లోనూ విజయకేతనం ఎగరేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడో కథతో, నాలుగో ప్రయత్నంగా ‘కింగ్డమ్’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ యువదర్శకునికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం జూలై 31న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.