త్రిబుల్ ఆర్ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేశాడు జూనియర్ ఎన్టీఆర్ ( Jr. NTR ). 2015లో వచ్చిన టెంపర్ సినిమా తర్వాత ఈయనకు ఎదురు లేదు. దానికి ముందు వరుస ప్లాపులతో ఇబ్బంది పడిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత కథల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడు. నచ్చకపోతే మొహం మీదే వద్దు అని చెప్పేస్తున్నాడు. అందుకే నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ట్రిపుల్ ఆర్ ( RRR ) లాంటి వరుస విజయాలు తారక్ ఖాతాలో చేరిపోయాయి. ఎంత పెద్ద దర్శకుడైన కథ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు జూనియర్ ఎన్టీఆర్.
కేవలం రాజమౌళి ( Rajamouli )కి మాత్రమే కథ వినకుండా ఓకే చెప్పాడు యంగ్ టైగర్. తాజాగా కొరటాల శివ ( Koratala shiva ) విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఈయన. ఆచార్య ఫ్లాప్ కావడంతో.. తన సినిమా కథ విషయంలో ఏమాత్రం రిస్క్ తీసుకోవడం లేదు. కావలసినంత టైం తీసుకొని కథ సిద్ధం చేయాల్సిందిగా కొరటాలని కోరుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇదిలా ఉంటే ఈయనతో పాటు ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ), బుచ్చిబాబు సనా ( Buchibabu ) సినిమాలకు కూడా ఓకే చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్.
ఇందులో ప్రశాంత్ సినిమా మొదలవడానికి చాలా టైం పడుతుంది. కానీ బుచ్చిబాబు మాత్రం వీలైనంత త్వరగా స్క్రిప్ట్ పూర్తి చేసి ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ఆరాటపడుతున్నాడు. ఈయన రాసుకున్న కథలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి 65 ఏళ్ల వృద్ధుడి పాత్ర అయితే.. మరొకటి 30 ఏళ్ల యువకుడి పాత్ర. పైగా ఆ వృద్ధుడి పాత్రకు ఒక లోపం పెట్టి.. వీల్ చైర్ కు పరిమితం చేస్తున్నాడు బుచ్చిబాబు సన. ఇది పూర్తిగా స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. ఇందులో యంగ్ ఎన్టీఆర్ పాత్ర విభిన్నంగా ఉండబోతుందని.. అలాగే ముసలి పాత్రను కూడా చాలెంజింగ్ గా బుచ్చి రాస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఈయన చెప్పిన లైన్ కు బాగా ఎక్సైట్ అయిన జూనియర్ ఎన్టీఆర్.. కథ విషయంలో మాత్రం చాలా మార్పులు సూచించాడు. అందుకే తన గురువు సుకుమార్ సూచనలు తీసుకున్నాడు బుచ్చిబాబు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోకు లోపం పెట్టడం 65 ఏళ్ల వృద్ధుడి పాత్ర చేయిస్తూ.. వీల్ చైర్ కు పరిమితం చేయడం లాంటివి చాలా సాహసంతో కూడుకున్న విషయాలు. ఇలాంటి కథతో అభిమానులను మెప్పించడం అంటే చిన్న విషయం కాదు. దానికి చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే ఉప్పెన విడుదలై ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికీ ఎన్టీఆర్ సినిమా కథ పైన కూర్చున్నాడు బుచ్చిబాబు సన. మరి ఈ కాంబినేషన్లో రాబోయే సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అన్నట్టు నాన్నకు ప్రేమతో సమయం నుంచే బుచ్చిబాబుతో ఎన్టీఆర్ కు పరిచయం ఉంది. అందుకే అతడి సత్తా గురించి తెలిసే అవకాశం ఇచ్చాడు తారక్.
ఇవి కూడా చదవండి..