సమంత అలాంటి సంచలన నిర్ణయం తీసుకుందా..?
సమంత.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా ఈమెకు చాలా క్రేజ్ ఉంది. తాజాగా హిందీలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొంది సమంత. మరీ ముఖ్యంగా విడాకులు తీసుకున్న తర్వాత ఈమె తగ్గేది లే అంటుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ ఇండస్ట్రీలోనూ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది సమంత. ఇంకా చెప్పాలంటే తెలుగు కంటే ఎక్కువగా ఈమెకు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. పైగా గ్లామర్ షోకు కూడా అడ్డు చెప్పకపోవడంతో ఈమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.
ఒక్కో సినిమా కోసం 5 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్న కూడా.. ఈమెకు ఉన్న పాపులారిటీ దృష్టిలో పెట్టుకొని ఓకే అంటున్నారు నిర్మాతలు. ఇదిలా ఉంటే తాజాగా సమంత ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై రొమాంటిక్ క్యారెక్టర్స్ చేయకూడదని.. కేవలం యాక్షన్ పాత్రలు మాత్రమే చేస్తూ కెరీర్లో ముందుకు వెళ్లాలని డిసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. కథ బాగా నచ్చినప్పుడు కచ్చితంగా రొమాంటిక్ యాంగిల్ చూపించవచ్చు కానీ.. ప్రతి సినిమాలో గ్లామర్ గా కనిపించాలి అంటే మాత్రం కుదరదు అని నిర్మాతలకు ఖరాకండిగా చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాలు.. ఎంపిక చేసుకుంటున్న కథలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. తెలుగులో శాకుంతలం, యశోద సినిమాలు భిన్నమైన కథాంశంతో వస్తున్నాయి. హిందీలో చేస్తున్న వెబ్ సిరీస్ కూడా పూర్తిగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే వస్తుంది. ఇకపై చేయబోయే సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. విజయ్ దేవరకొండతో నటిస్తున్న ఖుషి సినిమా మాత్రమే ఈమె చేస్తున్న ప్రేమ కథ. మరి ఈయన తీసుకున్న నిర్ణయం కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపించబోతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Cobra Movie | నెగెటీవ్ రివ్యూస్ రావడంతో ‘కోబ్రా’లో ఆ మార్పులు చేసిన మేకర్స్..!
Sunny Leone | ‘అందానికే అందానివే..’ ట్రెండింగ్‌లో సన్నీలియోన్ లుక్స్
Mike Tyson | మైక్‌టైసన్‌కు భారీ రెమ్యునరేషన్..అయినా..!
Irfan Pathan | మాజీ క్రికెటర్‌కు పవన్ కల్యాణ్ స్టైల్ అంటే ఇష్టమట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

