Cobra Movie | నెగెటీవ్ రివ్యూస్ రావడంతో ‘కోబ్రా’లో ఆ మార్పులు చేసిన మేకర్స్..!
Cobra Movie trimmed | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ ఏర్పరచుకున్న నటుడు చియాన్ విక్రమ్. చాలా కాలం తర్వాత ‘మహాన్’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన విక్రమ్.. తాజాగా ‘కోబ్రా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కథ బాగానే ఉన్నా, కథనం స్లోగా ఉందని, లెంగ్త్ బాగా ఎక్కువైందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. దాంతో మేకర్స్ ఈ చిత్రాన్ని మరోసారి ఎడిటింగ్ చేశారు.
ఎడిటింగ్‌లో ఈ చిత్రాన్ని దాదాపు 20 నిమిషాలు ట్రిమ్ చేసినట్లు టాక్. ఇక ఎడిట్ వెర్షన్ గురువారం సాయంత్రం షోస్ నుండి అందుబాటులో ఉంది. ముందుగా ఈ చిత్రం 3 గంటల మూడు నిమిషాలు ఉండగా.. ఇప్పుడు 2 గంటల 43 నిమిషాలుగా ఉంది. ఇక ఈ చిత్రంలో విక్రమ్ సైంటిస్టుగా అద్భుతమైన నటనను కనబరిచారు. విభిన్న రకాల గెటప్స్‌లో అదరగొట్టాడు. టాక్ ఎలా ఉన్నా ఈ చిత్రం విక్రమ్ కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. ఇర్ఫాన్ పఠాన్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రంలో విక్రమ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. మృనాళిని రవి ముఖ్య పాత్రలో నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

