ఎప్పటికపుడు ట్రెండీ లుక్‌లో కనిపిస్తూ..కుర్రకారు గుండెల్ని పిండేయడం సన్నీలియోన్ (Sunny Leone)కు కొత్తేమీ కాదు. నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక స్టిల్‌తో దర్శనమిస్తూ నెటిజన్లు, ఫాలోవర్లు, మూవీ లవర్స్ కు కంటిమీదు కనుకులేకుండా చేస్తుంటుంది సన్నీ. బికినీ షూట్లో ఉన్నా..ట్రెండీ కాస్ట్యూమ్ అయినా, సంప్రదాయక వస్త్రధారణలోనైనా అదిరిపోయే అందంతో అందరినీ కట్టిపడేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ డ్రెస్‌లో ధగ ధగ మెరిసిపోతుంది.
తాజా లుక్‌లో అందానికే అందానివే అంటూ సాగే మురారి పాటను గుర్తు చేస్తుంది. డార్క్ బ్లూ కలర్ బాడీ హగ్గింగ్ కాస్ట్యూమ్స్ (body hugging costume), మెస్మరైజింగ్ స్కిల్ టోన్‌తో కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఇపుడీ ఫొటోలు నెట్టింట సెగలు రేపుతున్నాయి. సన్నీలియోన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
తెలుగులో ఈ బ్యూటీ మంచు విష్ణు హీరోగా నటిస్తున్న జిన్నా చిత్రంలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మరోవైపు సన్నీలియోన్ మలయాళంలో డెబ్యూ చిత్రం రంగీలా (Rangeela)చేస్తోంది. దీంతోపాటు తమిళంలో వీరమాదేవి, షేరో, ఓ మై ఘోస్ట్, హిందీలో కోకా కోలా, హెలెన్, ది బాటిల్ ఆఫ్ బీమా కోరేగావ్, కన్నడలో చాంపియన్ సినిమాల్లో నటిస్తోంది.
My night at @filmfare ✨ pic.twitter.com/tFVlp53qf5
— Sunny Leone (@SunnyLeone) August 31, 2022
Read Also : Chiranjeevi | లో క్లాస్ టికెట్స్ లైన్లో నాగబాబుకు ఊపిరాడలేదు : చిరంజీవి
Read Also : 67th Filmfare Awards | ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్..ఉత్తమ నటిగా కృతిసనన్
Read Also : Irfan Pathan | మాజీ క్రికెటర్‌కు పవన్ కల్యాణ్ స్టైల్ అంటే ఇష్టమట..!
Read Also : Tollywood Ganesh idols | మార్కెట్లో టాలీవుడ్ స్పెషల్ గణేశుల సందడి