Aamir Khan | ‘లాల్ సింగ్ చడ్డా’ ఫలితం.. అమీర్ ఖాన్‌ను అలాంటి నిర్ణయం తీసుకునేలా చేసిందా?
Aamir Khan Sensational Desition | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం ఒక హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. 2018లో భారీ అంచనాల మధ్య విడుదలయిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ అమీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా మిగిలింది. ఆ తర్వాత నాలుగేళ్ళ వరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. ఈ క్రమంలో ఆగస్టు 11న అమీర్ ‘లాల్ సింగ్ చడ్డా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం మొదటి షో నుండి నెగెటీవ్ టాక్ తెచ్చుకుని అమీర్‌కు మరో భారీ ఫ్లాప్‌గా మిగిలింది. ఇలా వరుసగా రెండు సినిమాలు డిజాస్టర్లు కావడంతో అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. ‘లాల్ సింగ్ చడ్డా’ ఫలితం అమీర్‌ను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. దాదాపు 180 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఫైనల్‌గా 70కోట్లను మాత్రమే సాధించింది.
ఈ చిత్రాన్ని వయాకమ్ 18 స్టూడీయోస్‌తో కలిసి అమీర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. అయితే తన సహా నిర్మాతలకు ఇబ్బంది కలిగించొద్దనే ఉద్ధేశంతో అమీర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట. కాగా ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ తీసుకున్న 50కోట్ల రెమ్యునరేషన్‌ను తిరిగి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడట. దీన్ని బట్టి చూస్తే అమీర్‌కు నిర్మాణవ్యయంతో కలుపుకొని 100కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఇలా నష్టం వస్తే రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేయడమంటే విశేషం అనే చెప్పాలి. దీనిపై పలువరు నెటీజన్లు అమీర్‌ను ప్రశంసిస్తున్నారు.
కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం హాలీవుడ్లో సూపర్ హిట్టయిన ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. నాగచైతన్య కీలకపాత్రలో నటించాడు. అమీర్‌కు జోడీగా కరీనాకపూర్ హీరోయిన్గా నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

