Hari Hari Veeramallu | పవర్ స్టార్మ్ వచ్చేసింది.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హరి హర వీరమల్లు’ గ్లింప్స్
Hari Hari Veeramallu Power Glance | ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. మూడేళ్ళ తర్వాత ‘వకీల్ సాబ్’తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం తర్వాత ‘భీమ్లా నాయక్’తో మరో సాలిడ్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు రావడంతో పవన్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈయన ‘హరి హర వీరమల్లు’ అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని చేస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ షూటింగ్ జరుపకుంటుంది. తాజాగా ఈ చిత్ర నిర్మాత ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 50శాతం పూర్తయిందని తెలిపాడు. కాగా శుక్రవారం పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
‘మెడల్ని వంచి, కథల్ని మార్చి, కొలిక్కితెచ్చే పనెట్టుకొని తొడకొట్టాడే.. తెలుగోడు’ అంటూ పవర్ ఫుల్ నేపథ్య సంగీతంతో ‘హరి హర వీరమల్లు’ గ్లింప్స్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. గ్లింప్స్‌లో పవన్ స్క్రీన్ ప్రజెన్స్ వేరే లెవల్లో ఉంది. కుస్తీలో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ పులిలా విజృంభిస్తున్నాడు. ముఖ్యంగా కీరవాణి నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ. దయాకర్ రావు నిర్మిస్తున్నాడు. ఎమ్. ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. పీరియాడికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

