NBK 109 | టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఎన్బీకే 109. వాల్తేరు వీరయ్యతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జైపూర్‌లో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా జైపూర్‌కు సంబంధించిన షెడ్యూల్ అయిపోయిందని త్వరలోనే టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు దర్శకుడు బాబీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.
ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌తో పాటు కన్నడ నటుడు రిషి విలన్ పాత్రల్లో నటించబోతున్నారు. మాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీలో బాలకృష్ణ గూడ్స్ రైలు నుంచి రెండు బ్యాగులు పట్టుకుని పొగమంచు మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తున్న లుక్, ఇప్పటికే లాంఛ్ చేసిన ఎన్బీకే 109 ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. ఊర్వశి రౌటేలా పోలీసాఫీసర్‌గా కనిపించబోతుంది. చాందినీ చౌదరి కీలక పాత్ర పోషిస్తోంది.
Wrapped up one of the most intense schedules of #NBK109 in Jaipur with the one and only #NandamuriBalakrishna Garu!
His unmatched energy lit up every moment..Get ready to witness the rage of #NBK Garu in these electrifying sequences. 🔥🔥
TITLE TEASER COMING SOON! 🤘@thedeol… pic.twitter.com/hVtL4uufM1
— Bobby (@dirbobby) August 12, 2024
Also Read..