బెంగుళూరు: బెంగుళూరులోని థార్డ్వేవ్ కాఫీ షాప్( Third Wave Coffee Shop)లో ఉన్న వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాను గుర్తించారు. ఈ కేసులో ఆ షాపులో పనిచేసే 23 ఏళ్ల ఉద్యోగిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరులోని సదాశివనగర పోలీస్ స్టేషన్ పరధిలో ఉన్న 80 ఫీట్ల రోడ్డుకు థార్డ్వేవ్ కాఫీ షాపు ఉన్నది. శనివారం ఆ స్టోర్‌కు కొందరు ఫ్రెండ్స్ వెళ్లారు. ఓ మహిళ షాపులో ఉన్న వాష్‌రూమ్‌కు వెళ్లగా, దాంట్లో మొబైల్ వీడియో రికార్డర్‌ను ఆమె గుర్తించింది. టిష్యూ పేపర్లో దాన్ని దాచిపెట్టారు. ఆ రికార్డర్ రెండు గంటలుగా ఆన్‌లో ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని మేనేజ్మెంట్కు చెప్పగా, వాళ్లు పోలీసులకు తెలిపారు. కాఫీ షాప్‌ను విజిట్ చేసిన పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. అనుమానిత వ్యక్తిని అరెస్టు చేసినట్లు బెంగుళూరు సిటీ డీసీపీ శేఖర్ హెచ్ టెక్కన్నవార్ తెలిపారు. నిందితుడు 23 ఏళ్ల వ్యక్తి అని, శివమొగ్గ జిల్లాకు చెందినవాడని చెప్పారు. ఏడాదిగా అతను ఆ కాఫీ షాపులో పనిచేస్తున్నాడు. మొబైల్‌ను సీజ్ చేసి, దాన్ని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. కేసుకు సంబంధించిన విచారణ కొనసాగిస్తున్నారు.