అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఏ వార్త బయటకొచ్చినా.. అది రూమర్ అయినా.. క్షణాల్లో వైరల్ అయిపోతున్నది. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన కీలక సమాచారం వెలుగు చూసింది. ఇప్పటికే ఈ సినిమా పనులు మొదలయ్యాయట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు వినికిడి. త్వరలో ఫస్ట్ షెడ్యూల్ కూడా మొదలుకానున్నదట.
మూడు నెలల పాటు ముంబైలో జరిగే ఈ భారీ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. తదనంతరం వీఎఫ్ఎక్స్ పనులకోసం టీమ్ మొత్తం అమెరికా వెళ్లనున్నదని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. సమాంతర ప్రపంచాల మధ్య, పునర్జన్మల నేపథ్యంలో సాగే సైన్స్‌ఫిక్షన్ కథాంశంగా ఈ సినిమా ఉంటుందట. ఈ సినిమాకోసం అట్లీ కొత్త ప్రపంచాన్నే సృష్టించే పనిలో ఉన్నారు. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.