Sreeleela | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నటీమణుల్లో టాప్‌లో ఉంటుంది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela). లీడింగ్ హీరోలతో నటిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్న ఈ భామ చేస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి రవితేజ 75 (RT75). టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) హీరోగా నటిస్తోన్న ఈ మూవీ మాస్ జాతర టైటిల్‌తో వస్తోంది.
రవితేజ గాయం నుంచి కోలుకోవడంతో తిరిగి షూట్లో పాల్గొంటున్నాడు. అయితే చిత్రయూనిట్‌ను ఓ విషయం కలవరపెడుతోందట. శ్రీలీల డేట్స్ సర్దుబాటు చేసుకోలేక కొంచెం డైలామాలో పడిపోయిందన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో మాస్ జాతర షెడ్యూల్‌కు టైం కేటాయించే పరిస్థితిలో లేదట.ఈ నేపథ్యంలో శ్రీలీలకు సంబంధించిన చాలా సన్నివేశాలు పెండింగ్‌లో ఉండిపోవడంతో.. మాస్ జాతర చిత్రీకరణ ఆలస్యమవుతోందని ఇన్సైడ్ టాక్.
బాలీవుడ్ డెబ్యూ తోపాటు 2025 క్యాలెండర్ ఇయర్‌తో బిజీగా షెడ్యూల్ పెట్టుకుంది శ్రీలీల. మరి డేట్స్ సర్దుబాటు చేసుకుని మాస్ జాతర షూట్‌కు టైం ఇస్తుందా..? లేదా..? అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ సినిమాతో సామజవరగమన ఫేం రైటర్ భాను బొగవరపు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తు్న్నాడు. పేరు లక్ష్మణ భేరి.. ఆదాయం చెప్పను తియ్.. ఖర్చు లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం అన్ లిమిటెడ్..అవమానం జీరో అంటూ ఇప్పటికే ఓ అప్డేట్ ఇచ్చి సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.
ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి బలగం ఫేమ్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
రవన్న మాస్ దావత్..
రవన్న మాస్ దావత్ షురూ రా భయ్….🥁🧨🤙🏻#MASSJathara ~ MASS RAMPAGE GLIMPSE will serve the BIGGEST ENTERTAINMENT platter on JAN 26th🔥
Let’s celebrate 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl’s birthday with loads of SWAG and a BLAST of EXPLOSIVE ACTION 😎 pic.twitter.com/2vSKni0S96
— BA Raju’s Team (@baraju_SuperHit) January 24, 2025
RT75 పోస్టర్..
అందరికి హ్యాపీ ఉగాది రా భయ్ 😎
We are elated to announce our next with the 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐉𝐀 @RaviTeja_offl ~ #RT75, Shoot Begins Soon! 🔥
వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు… రెడీ అయిపొండ్రి 🥳
We promise to bring back the typical Mass Maharaja on Big screens… pic.twitter.com/W7Q2Jdn6zO
— Sithara Entertainments (@SitharaEnts) April 9, 2024
Union Budget 2025 | గంటా 15 నిమిషాల పాటు కొనసాగిన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం