Dil Raju | ప్రపంచ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం రోజును పురస్కరించుకుని చేపట్టిన అవగాహన కార్యక్రమంలో రామ్ చరణ్, విజయ్ దేవరకొండతో పాటు దిల్ రాజు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన రామ్ చరణ్ తండ్రిగా నాకు భయమేస్తుంది. మాదక ద్రవ్యాల వలన రేపు పొద్దున్న మా పిల్లల్ని బయటకి పంపించాలంటే టెన్షన్‌గా ఉంది. మాదక ద్రవ్యాలు జీవితాన్ని నాశనం చేస్తాయి. పొద్దున్నే లేచి వ్యాయామం చేసి, ఆ తర్వాత మన వర్క్ పూర్తి చేసి, ఇంటికి వచ్చి ఓ ఆట ఆడుకుని, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడంలో ఎంతో హై ఉంటుందని అన్నాడు.
ఇక విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మనకి మన హెల్త్ చాలా ముఖ్యం. ఆరోగ్యం సరిగా లేకపోతే ఏమీ చేయలేం. యువతని పాడు చేస్తే ఒక దేశాన్ని పాడు చేసినట్టే అని విజయ్ అన్నారు. ఒక్కసారి డ్రగ్స్‌కి అలవాటు పడితే ఇంకా జీవితంలో మరో లక్ష్యం అంటూ ఏది ఉండదు. మన దేశం మనం నెంబర్ వన్ లో ఉండాలంటే మాదకద్రవ్యాలని మన చెంతకి రానివ్వకూడదు అని విజయ్ పిలుపునిచ్చారు. ఇక దిల్ రాజు మాట్లాడుతూ..మలయాళ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం నిర్ధారణ అయితే, సంబంధిత వ్యక్తులను పరిశ్రమ నుంచి బహిష్కరిస్తారు. తెలుగు పరిశ్రమలో కూడా అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇది సమాజానికి బలమైన సందేశాన్ని ఇస్తుంది అని దిల్ రాజు అన్నారు.
ఎఫ్డీసీ తరఫున చిత్ర పరిశ్రమ పెద్దలతో చర్చించి, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతివ్యక్తి తనవంతు పాత్ర పోషించాలి అని పిలుపునిచ్చారు దిల్ రాజు. నేను గాని నా కుటుంబ సభ్యులు గానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు కూడా మాదకద్రవ్యాలు తీసుకోకుండా నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. నాలాగే మీరందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మాదకద్రవ్యాలు లేకుండా నిర్మూలించగలుగుతాం అని స్పష్టం చేశారు దిల్ రాజు.