వంశీరామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రేవు’. హరినాథ్ పులి దర్శకుడు. డా॥ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి నిర్మాతలు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది.
శుక్రవారం అగ్ర నిర్మాత దిల్ రాజు ట్రైలర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..సినిమా కాన్సెప్ట్ బాగుందని, జర్నలిస్ట్ మిత్రులైన ప్రభు, రాంబాబు నిర్మాణ పర్యవేక్షణలో సినిమా తెరకెక్కడం ఆనందంగా ఉందని, ఈ సినిమా చూసి తాను రివ్యూ రాస్తానని అన్నారు. సెన్సార్ వాళ్లు కూడా చిత్రాన్ని మెచ్చుకున్నారని జర్నలిస్ట్ ప్రభు తెలిపారు.