Arya 3 Title | టాలీవుడ్ నుంచి ఆల్ టైమ్ ఫేవరేట్ సూపర్ హిట్ సినిమాల జాబితాలో టాప్‌లో ఉంటుంది ఆర్య. అల్లు అర్జున్, దిల్ రాజు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసింది. అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అమాంతం పెంచేసిన ఆర్య బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టింది.
ఇక ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ ఆర్య 2 బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయినా.. ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక
అల్లు అర్జున్ -సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ క్రేజీ ప్రాంఛైజీలో మరో పార్టు ఉండబోతుందా..? అంటే అవుననే చెబుతున్నాయి తాజా కథనాలు. దిల్ రాజు ఆర్య 3 టైటిల్‌ను ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేసినట్టు తాజా వార్త ఒకటి తెరపైకి వచ్చింది.
ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఏఏ22 సినిమాను లైన్లో పెట్టాడని తెలిసిందే. త్రివిక్రమ్‌తో మైథలాజికల్ ప్రాజెక్ట్, సుకుమార్‌తో పుష్ప 3 కూడా లైన్లో ఉన్నాయి. ఈ లెక్కన రాబోయే 2-3 ఏండ్ల వరకు బన్నీ ఫుల్ బిజీ అని అర్థమైపోతుంది. మరి ఇంతకీ దిల్ రాజు ఆర్య 3 టైటిల్ రిజిస్టర్ ఏ హీరో కోసం చేశాడంటూ చర్చ మొదలైంది. ఈ టైటిల్‌ను తన మేనల్లుడు ఆశిష్ రెడ్డి కొత్త ప్రాజెక్ట్ కోసమే రిజిస్టర్ చేశారంటూ మరో టాక్ కూడా నడుస్తోంది.
మరి ఆర్య 3 సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది.. ఆశిష్ రెడ్డినే హీరోగా ఉంటాడా..? దీనిపై బన్నీ రియాక్షన్ ఎలా ఉంటుందనేది చూడాలి.
Raashi Khanna | సినిమాలంటే ఆసక్తి లేదట.. తన రూంమేట్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన రాశీఖన్నా
Ruchi Gujjar | మోదీ నెక్లెస్‌తో కేన్స్‌లో సందడి చేసిన బాలీవుడ్ భామ.. అందరి చూపు ఆమె వైపే
Thug life | ముంబైలో కమల్‌హాసన్, శింబు థగ్‌లైఫ్ టీం.. ట్రెండింగ్‌లో స్టిల్స్