సంబీత్ ఆచార్య, జోశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎమ్4ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్). మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మోహన్ మీడియా క్రియేషన్స్, జోశర్మ మెక్విన్ గ్రూప్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా టైటిల్‌ను ఇటీవల అగ్ర నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.
ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘వైవిధ్యమైన కథాంశమిది. రాహుల్ ఆడబాల, జో శర్మ కథ రాయడంలో నాకు సహకరించారు. ఆద్యంతం అనూహ్య మలుపులతో ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచే చిత్రమిది. కథ, కథనాలు సరికొత్తగా ఉంటాయి’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్, సంగీతం: వసంత్ ఇసైపట్టై, దర్శకత్వం: మోహన్ వడ్లపట్ల.