దీనస్థితిలో సీనియర్ నటి పావలా శ్యామల
తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 300 పై చిలుకు చిత్రాల్లో తనదైన నటనతో నవ్వుల్ని పంచిన హాస్య నటి పావలా శ్యామల ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. గత కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పావలా శ్యామల అత్యవసర చికిత్స నిమిత్తం శుక్రవారం రాత్రి కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిసింది.
- అర్థరాత్రి ఫుట్‌పాత్‌పై వదిలేసిన క్యాబ్ డ్రైవర్ అండగా నిలిచిన నిర్మాత దిల్ రాజు
తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 300 పై చిలుకు చిత్రాల్లో తనదైన నటనతో నవ్వుల్ని పంచిన హాస్య నటి పావలా శ్యామల ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. గత కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పావలా శ్యామల అత్యవసర చికిత్స నిమిత్తం శుక్రవారం రాత్రి కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిసింది.
చేతిలో తగినంత డబ్బులు లేకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యం చికిత్సకు నిరాకరించినట్లుగా సమాచారం. ఆసుపత్రి వారు ఓ ప్రైవేట్ క్యాబ్‌ను బుక్ చేసి పంపించగా సదరు క్యాబ్ డ్రైవర్ అర్ధరాత్రి ఆమెను కూకట్పల్లి వై జంక్షన్ వద్ద వదిలిపెట్టి వెళ్లాడని తెలిసింది. రోడ్డు పక్కన దయనీయ స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను ‘ఆర్కే ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని తెలిసింది.
అండగా నిలిచిన దిల్‌రాజు
పావలా శ్యామల దీనస్థితిని తెలుసుకున్న అగ్ర నిర్మాత దిల్‌రాజు ఆమెకు అండగా నిలిచారు. కూకట్‌పల్లిలోని ప్రసాద్ ఆసుపత్రిలో పావలా శ్యామల చికిత్స పొందుతున్నారని తన సిబ్బంది ద్వారా తెలుసుకున్న దిల్ రాజు.. వైద్యులకు ఫోన్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పూర్తిస్థాయి చికిత్స కోసం తాను సహాయం చేస్తానని భరోసానిచ్చారు. గతంలో కూడా దిల్‌రాజు తనను ఆదుకున్నారని, మరోమారు సహాయం అందించినందుకు దిల్‌రాజుకు పావలా శ్యామల కృతజ్ఞతలు తెలియజేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breakfast | ఉదయం అల్పాహారంలో ఇవి తింటున్నారా? రోజంతా నీరసం వస్తుంది..!
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
MBBS Seat | పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన మాగనూర్ ముద్దుబిడ్డ
Ajmer Jailer | మహిళా ఖైదీలతో ఇంటి పనులు చేయిస్తున్న జైలర్ అరెస్ట్
పూలతో బతుకమ్మ వైభవం- అక్షరాలతో భావితరాల వికాసం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

