అగ్ర నిర్మాత దిల్‌రాజు కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ‘రాజావారు రాణిగారు’ చిత్రం తర్వాత ‘అశోకవనంలో అర్జు న కళ్యాణం’ చిత్రానికి షోరన్నర్‌గా వ్యవహరించిన రవి కిరణ్ కోలా ఈ సినిమాతో మరోసారి మెగాఫోన్ పట్టబోతున్నారు.
‘ఈ సినిమా కోసం దర్శకుడు రవికిరణ్ కోలా వైవిధ్యమైన కథను సిద్ధం చేశాడు. కథ, కథనాలు ఆసక్తిగా సాగుతాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటిస్తాం’ అని చిత్ర బృందం పేర్కొంది.