రణ్‌వీర్‌సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’కు దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు లభించాయి. ఇప్పటికే ఈ సినిమా 900కోట్ల వరకూ కలెక్షన్స్ రాబట్టిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మార్చి 19న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సీక్వెల్‌కు ‘ధురంధర్: ది రివేంజ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. త్వరలో టీజర్‌ను విడుదల చేయబోతున్నారు.
భారత గూఢచారి అయిన ధురంధర్ పాకిస్థాన్‌లోని భయంకరమైన కరాచీ గ్యాంగ్‌లో చొరబడి చేపట్టిన ఆపరేషన్ నేపథ్యంలో ‘ధురంధర్’ సినిమా కథ ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచింది. సీక్వెల్లో స్క్రీన్‌ప్లే మరింత ఆసక్తికరంగా ఉంటుందని, అనూహ్య మలుపులతో సాగుతుందని, యాక్షన్ ఘట్టాలు రోమాంచితంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ‘ధురంధర్’ చిత్రంలో అక్షయ్ఖన్నా, ఆర్.మాధవన్, సంజయ్‌దత్, అర్జున్ రామ్‌పాల్, సారా అర్జున్ కీలక పాత్రల్ని పోషించారు. ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కొనసాగుతున్నది.