రణ్‌వీర్‌సింగ్ కథానాయకుడిగా నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ గత ఏడాది భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచనాల్ని సృష్టించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు మేకర్స్ గతంలోనే వెల్లడించారు.
‘ధురంధర్: ది రివేంజ్’ పేరుతో సీక్వెల్ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండో భాగాన్ని హిందీతో పాటు దక్షిణాది భాషల్లో విడుదల చేయబోతున్నారు. మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు. భారీ యాక్షన్, ఉత్కంఠభరిత సన్నివేశాలతో టీజర్ ఆసాంతం ఆకట్టుకుంది.
‘ఇది నూతన భారతదేశం. సరిహద్దులు దాటి చొరబడుతుంది. దెబ్బ కొట్టి తీరుతుంది’ అంటూ ట్రైలర్ చివరలో రణ్‌వీర్‌సింగ్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్ఖన్నా, సంజయ్‌దత్, మాధవన్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.