సోమవారం 28 సెప్టెంబర్ 2020
Cinema - Aug 08, 2020 , 00:15:32

కరాబు మైండ్‌ కరాబు

కరాబు మైండ్‌ కరాబు

ధ్రువ సర్జా, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘పొగరు’. నందకిశోర్‌ దర్శకుడు. బి.కె. గంగాధర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘కరాబు మైండ్‌ కరాబు..’ అనే వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదలచేసింది.  హీరో క్యారెక్టరైజేషన్‌ను తెలియజేస్తూ సాగే ఈ గీతాన్ని అనుగార్‌ కులకర్ణి ఆలపించారు. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. చందన్‌శెట్టి సంగీతాన్ని సమకూర్చారు. ‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియన్‌ చిత్రమిది. రాక్షసుడి లాంటి రౌడీలో ఓ అమ్మాయి ప్రేమ ఎలాంటి మార్పుల్ని తీసుకొచ్చిందన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. ధ్రువ సర్జాపై చిత్రీకరించిన యాక్షన్‌ సన్నివేశాలు, రష్మిక మందన్న అభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’ అని చిత్రబృందం తెలిపింది.  సంపత్‌రాజ్‌, ధనంజయ్‌, పవిత్రా లోకేష్‌, రవిశంకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్‌.డి. విజయ్‌ మిల్టన్‌, ఎడిటర్‌:కె.ఎం. ప్రకాష్‌. logo