Chandrababu | ఓటేసిన వారిని కాటేసే రకం వైఎస్ జగన్ : చంద్రబాబు విమర్శ
Chandrababu | ఒక్కచాన్స్ ఇవ్వాలని కోరి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఓటేసిన వారిని కాటేసారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
అమరావతి : ఒక్కచాన్స్ ఇవ్వాలని కోరి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ (YS Jagan) ఓటేసిన వారిని కాటేసారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu) ఆరోపించారు. ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కురుపాం ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. మోసపు వాగ్ధానాలతో జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. దళిత, గిరిజనులకు మోసం చేసిన వ్యక్తికి ఓటు వేయవద్దని కోరారు. కూటమి అధికారంలోకి రాగానే జీవో నంబర్ 3ను పునురుద్ధరించి స్థానికులకే ఉద్యోగాలిస్తామని పునరుద్ఘాటించారు.
వైఎస్ జగన్ క్యాన్సర్ గడ్డలాంటివారని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు పెరిగిపోయాయని, తాము అధికారంలోకి రాగానే దాడులను అరికడతామని అన్నారు. విజయవాడలో నరేంద్ర మోదీ రోడ్ షో (Modi Road Show) ను చూసి అధికార వైసీపీ కాడ ఎత్తివేసిందని విమర్శించారు. రెండు వందల రూపాయలున్న పింఛన్లను రెండువేలకు టీడీపీ పెంచిందని, రాబోయే రోజుల్లో ఏప్రిల్ నుంచే రూ.4 వేలు పింఛన్లు అందజేస్తామని ప్రకటించారు.
రైతుల పాస్ పుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు వేశారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా భూములను లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రచారానికి వైసీపీ ప్యాన్ రెక్కలు విరగడం ఖాయమని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exams | విద్యార్థులకు సమ్మర్ టెన్షన్.. పరీక్షల సమయంలో కరెంట్, నీటి కష్టాలు తప్పవా?
SIR | తెలంగాణలో ఓట్ల తొలగింపు కలకలం.. 5.84 లక్షల ఫామ్-7 దరఖాస్తులు.. అసలేం జరుగుతోంది?
Alphabet Shares | రూ.45.76 లక్షల కోట్లు ఫట్… ఒక్కరోజే భారీగా కరిగిపోయిన గూగుల్ విలువ
Crypto Heist | క్రిప్టో చరిత్రలోనే అతిపెద్ద చోరీ.. 20 నిమిషాల్లో రూ.52వేల కోట్ల క్రిప్టో కరెన్సీ మాయం!!
Water Management | నీటి వృథాను అరికడితేనే.. కరువు నుంచి రక్షణ.. ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ బీవీ సుబ్బారావు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

