“ధూం ధాం’ చిత్రానికి విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ప్రతి సెంటర్లో 80 శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తున్నది. సినిమాలోని ఎంటర్టైన్మెంట్ ప్రేక్షుకుల్ని అలరిస్తున్నది’ అన్నారు చేతన్‌కృష్ణ. ఆయన హీరోగా నటించిన ‘ధూం ధాం’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాయికిషోర్ మచ్చా దర్శకత్వంలో ఎం.ఎస్.రామ్‌కుమార్ నిర్మించారు. శనివారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత రామ్‌కుమార్ మాట్లాడుతూ ‘పెద్ద సినిమాల పోటీలో చిన్న చిత్రమైన ‘ధూం ధాం’ నిలదొక్కుకోవడం గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా ప్రేక్షకులందరూ థియేటర్లో సినిమా చూడాలని కోరుతున్నా. ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను థియేటర్లో చూస్తేనే మంచి అనుభూతిని పొందుతాం’ అన్నారు. కడుపుబ్బా నవ్వించే వినోదంతో సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్నదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.