లక్ష్ చదలవాడ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ధీర’. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. మాస్, యాక్షన్, ఎమోషన్ అంశాలతో ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా సాగింది. ‘ఈ మనిషి బ్రెయిన్ ఉంది చూడు.. అది వెరీ డేంజరస్.
నేను యుద్ధం చేయడం కాదు.. యుద్ధమే మిమ్మల్ని వెంటాడుతూ వేటాడుతూ వస్తోంది..’ అనే డైలాగ్స్ హీరో క్యారెక్టరైజేషన్‌ను ఆవిష్కరించాయి. హీరో లక్ష్ యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. నేహా పఠాన్, సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కన్నా పీసీ, సంగీతం: సాయికార్తీక్, సమర్పణ: చదలవాడ బ్రదర్స్, రచన-దర్శకత్వం: విక్రాంత్ శ్రీనివాస్.