Dhanush | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ యాక్టర్లలో ఒకడిగా నిలిచాడు ధనుష్ (Dhanush). తెలుగు, తమిళం, పాన్ ఇండియాతోపాటు హాలీవుడ్ స్థాయిలో కూడా ధనుష్‌కు సూపర్ క్రేజ్ ఉందని తెలిసిందే. ది ఎక్స్ట్రార్డినరీ ఫకిర్, ది గ్రే మ్యాన్ సినిమాలతో హాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చిన ధనుష్.. మరో సినిమా చేయబోతున్నాడన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఈ సారి ధనుష్ స్ట్రీట్ ఫైటర్‌గా మారబోతున్నాడట. తాజా టాక్ ప్రకారం పాపులర్ అమెరికన్ నటి సిడ్నీ స్వీనీ (Sydney Sweeney)తో జతకట్టబోతున్నాడట. ధనుష్, సిడ్నీ స్ట్రీట్ ఫైటర్ టైటిల్‌తో రాబోతున్న సినిమాలో కలిసి నటించబోతున్నారని ఇండస్ట్రీ సర్కిల్లో కథనాలు రౌండప్ చేస్తున్నాయి.
సోనీ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుందని తెలుస్తుండగా.. దీనిపై ధనుష్ లేదా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ వార్త అఫీషియల్ కాకున్నా మూవీ లవర్స్, అభిమానులు మాత్రం ధనుష్‌ను అప్పుడే స్ట్రీట్ ఫైటర్‌గా ఊహించేసుకుంటున్నారు. కాగా సిడ్నీ స్వీని అప్‌కమింగ్ స్పోర్ట్స్ బయోపిక్‌లో మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ క్రిస్టీ మార్టిన్గా కనిపించనుంది.
ధనుష్ ఖాతాలో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో చేస్తున్న కుబేర, స్వీయ దర్శకత్వంలో ఇడ్లీ కడై, ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో తేరే ఇష్క్ మే (Tere ishk mein) సినిమాలతోపాటు అరుణ్ మథేశ్వరన్ ఇళయరాజా బయోపిక్ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో స్ట్రీట్ ఫైటర్‌పై ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Manchu Manoj | నా తల్లి ఆస్పత్రిలో లేదు.. మాట్లాడుకోవడానికి సిద్ధం : మంచు మనోజ్
Vishwak Sen | జాతి రత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్సేన్ సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్ లుక్..!