Dhanush | సినిమాల జాతర ఎక్కువగా ఉండే సీజన్లలో ఒకటి దసరా. ఈ పండుగకు బాక్సాఫీస్ వద్ద పెద్ద పెద్ద సినిమాలు బరిలో దిగి పోటీపడుతుంటాయి. ప్రతీ యేటా తెలుగు, తమిళంతోపాటు పలు ప్రధాన భాషల్లో సినిమాలు విడుదలవుతుంటాయని తెలిసిందే. అయితే దసరా బరిలో నిలిచి గెలిచేదెవరనేది పక్కన పెడితే ఒకేసారి విడుదలయ్యే సినిమాలపై మాత్రం సూపర్ క్రేజ్ ఉంటుంది. అలాంటి క్రేజ్ ఇప్పుడు ధనుష్, రిషబ్ శెట్టి, పవన్ కల్యాణ్ సినిమాల మధ్య నెలకొందనే టాపిక్ ఆసక్తికరంగా మారింది.
రిషబ్ శెట్టి నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం కాంతార చాప్టర్ 1. ఈ మూవీ అక్టోబర్ 1న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి కన్నడతోపాటు తెలుగు భాషల్లో సూపర్ బజ్ క్రియేట్ అవుతోంది. మరోవైపు కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తోన్న చిత్రం ఇడ్లీ కడై. ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా అక్టోబర్ 1న లాక్ చేశారు. ధనుష్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాల కంటే వారం ముందు పవన్ కల్యాణ్ నటిస్తోన్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ సెప్టెంబర్ 5న విడుదలవుతోంది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం కనీసం రెండు వారాలపాటు ఓజీ థియేటర్లను డామినేట్ చేయడం చేయడం పక్కా అని టాక్.
ఓ వైపు గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కాంతార ప్రీక్వెల్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. మరోవైపు ఓజీ భారీ అంచనాల మధ్య రిలీజవబోతుంది. కాంతార చాప్టర్ 1, ఓజీ చిత్రాలు విడుదల ఉన్న విషయం తెలిసీ మరి ధనుష్ ఇడ్లీ కడైను రిలీజ్ చేస్తూ రిస్క్ చేస్తున్నాడేమోనంటూ చర్చించుకుంటున్నారు కొంతమంది సినీ జనాలు, నెటిజన్లు.
ఈ నేపథ్యంలో ఇడ్లీ కడై ఏపీ, తెలంగాణలో ఏ స్థాయిలో థియేటర్లను సంపాదించుకుంటుంది.. మరోవైపు కర్ణాటకలో కూడా తన స్థానాన్ని ఎలా కాపాడుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో ఇడ్లీ కడై చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్ రెడ్ జియాంట్ ఫిల్మ్స్ పంపిణీ చేస్తుండటంతో.. ఇక తమిళనాడు బయట పోటీ ఎలా ఉండబోతున్నదే చూడాల్సి ఉంది.
Shilpa Shetty | కొత్తగా మీ ముందుకొస్తున్నాం.. రెస్టారెంట్ మూసివేతపై క్లారిటీ ఇచ్చిన శిల్పా శెట్టి
Ghaati | ఘాటి అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టిక్కెట్స్