Keerthy Suresh | నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేశ్ (Keerthy Suresh) నటిస్తోన్న చిత్రం రివాల్వర్ రీటా (Revolver Rita). చంద్రు (Kaddipudi Chandru) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నవంబర్ 28న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది కీర్తిసురేశ్. ఓ చిట్ చాట్‌లో కీర్తిసురేశ్ తన కోస్టార్ ధనుష్ గురించి ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది.
‘హాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో తన అనుభవాల గురించి ఒక పుస్తకం రాయమని ధనుష్ సార్‌ను అడిగా. అప్పుడు ఆయన నాతో కీర్తి నేను ఒక పుస్తకం రాస్తే , నేను జీవితంలో సాధించాల్సినవన్నీ సాధించానని అర్థం కాదా..? అని అన్నాడు. ఒక అనుభవజ్ఞుడైన సక్సెస్ఫుల్ యాక్టర్ అలా చెప్పినప్పుడు ఆ మాటలు నా దృక్పథాన్ని మార్చేశాయి. నేను ఇప్పుడే ప్రయాణం మొదలుపెట్టాననిపిస్తుంది. నేను ప్రతీ రోజు నేర్చుకుంటున్నా. పరిణామం అనేది ప్రయాణంలో ఒక భాగం.. ముఖ్యంగా మీ తప్పులను నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు’ అంటూ చెప్పుకొచ్చింది కీర్తిసురేశ్. ధనుష్ గురించి కీర్తిసురేశ్ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కీర్తిసురేశ్, ధనుష్ కాంబినేషన్లో Thodari సినిమా వచ్చిందని తెలిసిందే.
రివాల్వర్ రీటా తెలుగు పంపిణీ హక్కులను హాస్య మూవీస్ నిర్మాత రాజేశ్ దండా దక్కించుకోగా.. కర్ణాటక హక్కులను బెంగళూరు కుమార్ ఫిలిమ్స్ దక్కించుకుంది. ఈ మూవీలో రాధికాశరత్ కుమార్, అజయ్ ఘోష్, సునీల్, జాన్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన రివాల్వర్ రీటా టీజర్ కీర్తి సురేశ్ మార్క్ హ్యూమర్ టచ్‌తో యాక్షన్ పార్టుతో స్టన్నింగ్‌గా సాగుతోంది.
రివాల్వర్ రీటా ఏదైనా మిషన్‌లో పాల్గొంటుందా.. ?
కీర్తి సురేశ్ మార్కెట్లో కూరగాయలు కొంటుండగా.. పాత అంబాసిడర్ కారులో ఉన్న దొంగలునుంచి ఆమెను చూస్తారు. కారులో కీర్తిసురేశ్ దగ్గరకు వచ్చి హ్యాండ్ బ్యాగ్‌ను లాక్కెళ్తారు. ఆ తర్వాత వారిని వెంబడించిన కీర్తిసురేశ్ రివాల్వర్ రీటాగా మారుతుంది. ఇంతకీ రివాల్వర్ రీటా ఏదైనా మిషన్‌లో పాల్గొంటుందా.. ? అనేది సస్పెన్స్ లో పెడుతూ సాగే సన్నివేశాలు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
Sampath Nandi | దర్శకుడు సంపత్ నంది ఇంట్లో విషాదం .. సినీ ప్రముఖులు సంతాపం