Vada Chennai 2 | ధనుష్-వెట్రిమారన్ కాంబినేషన్ అంటే వెంటనే గుర్తొచ్చే సినిమా వడ చెన్నై. గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో 2018లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ ఇద్దరు మరోసారి సీక్వెల్ ప్రాజెక్ట్ వడ చెన్నై 2 (Vada Chennai 2)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇప్పటికే వార్తలు రౌండప్ చేస్తున్నాయి.
శింబుతో చేయబోతున్న సినిమా త్వరలోనే మొదలవుతుందని.. ఈ మూవీ పూర్తవగానే వడ చెన్నై 2ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్టు వెట్రిమారన్ క్లారిటీ కూడా గతంలో ఇచ్చాడు. తాజాగా ధనుష్ అధికారికంగా వడ చెన్నై 2 సినిమా గురించి ప్రకటించి అభిమానుల్లో నెలకొన్న డైలమాకు చెక్ పెట్టాడు. ప్రస్తుతం ఇడ్లీ కడై ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు ధనుష్.
ప్రమోషనల్ ఈవెంట్లో సీక్వెల్ గురించి ధనుష్ మాట్లాడుతూ.. వడ చెన్నై 2 షూటింగ్ 2026లో మొదలవుతుంది. ఈ మూవీని 2027లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న వడ చెన్నై 2పై తమ ఫేవరేట్ స్టార్ యాక్టర్ నుంచే స్పష్టత ఇవ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
వడ చెన్నై ఫస్ట్ పార్టులో అండ్రియా, అమీర్, కిశోర్, సముద్రఖని, ఐశ్వర్య రాజేశ్ ఇతర కీలక పాత్రల్లో నటించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్. కాగా మరి సీక్వెల్లో ఎవరెవరు సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతున్నారనేది ఆసక్తిగా నెలకొంది.
Jacqueline Fernandez | డోన్ట్ కేర్ అంటూ ఫ్యాషన్ వీక్‌లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సందడి.. వీడియో
Imanvi | చారిత్రక ప్రదేశాల్లో ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వీ షికారు
Nagarjuna | నాగార్జున 100వ సినిమా డైరెక్టర్ ఇతడే.. అప్పుడే రిలీజ్ ప్లాన్ కూడా..?