సినిమా నిర్మాణమే ఏడాది పడుతున్న ఈ రోజుల్లో.. ఒక స్టార్ హీరో నటించిన మూడు సినిమాలు ఒకే ఏడాదిలో విడుదలవ్వడం చిన్న విషయం కాదు. కానీ కోలీవుడ్ అగ్ర హీరో ధనుష్ ఈ ఫీట్‌ని సాధించారు. ఈ ఏడాది ఇప్పటికే కుబేర, ఇడ్లీకొట్టు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన.. ఈ నెల 28న ‘అమరకావ్యం’ చిత్రంతో ముచ్చటగా మూడోసారి రాబోతున్నారు.
బాలీవుడ్లో ధనుష్ నటించిన పానిండియా ప్రేమకథ ‘తేరే ఇష్క్ మేన్’ తెలుగులో ‘అమరకావ్యం’గా రానుంది. కృతి సనన్ కథానాయిక. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఏఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు.