15 ఏళ్ల వయస్సులోనే ‘నీ తోడు కావాలి’ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎందరో మనసులని గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. కొంత కాలం తర్వాత నిర్మాతగా మారిన ఛార్మి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి హిట్ సినిమాలు రూపొందిస్తుది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ అనే చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది.
మే 17 ఛార్మి బర్త్ డే కావడంతో ఆమెకు పలువురు ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ నుండి శుభాకాంక్షలే కాదు ఓ సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ఛార్మి దగ్గరకు వెళ్లింది. ఆ గిఫ్ట్ చూసి తెగ మురిసిపోయిన ఛార్మి అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టాగ్రాములో షేర్ చేసింది. కాగా, ఛార్మి చివరిగా ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా, ఇప్పుడు లైగర్ అనే పాన్ ఇండియా సినిమాతో రికార్డులు తిరిగరాయాలని అనుకుంటుంది.
The #Liger @TheDeverakonda Special Birthday presents to his lovely producer @Charmmeofficial @PuriConnects #PC #HBDCharmmekaur pic.twitter.com/fRAYSYWphY
— BA Raju's Team (@baraju_SuperHit) May 17, 2021