Devara | తెలుగు అగ్ర హీరో ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’(Devara). జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ విడుదల చేయగా.. యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇప్పుడు తాజాగా సెకండ్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను ఆగష్టు 05న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తారక్, జాన్వీలది రొమాంటిక్ పోస్టర్ ఒకటి వదిలారు. కాగా.. తంగం అంతరంగం అంటూ ఈ పాట ఉండబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరకర్త.
Sizzling Duo ka Love Dhamaka 🔥#DevaraSecondSingle on August 5th ❤️🔥#Devara #DevaraonSep27th pic.twitter.com/Yl8dAYNBg6
— Devara (@DevaraMovie) August 2, 2024
ALso Read..
Coaching Centre Case | ఢిల్లీ సివిల్స్ అభ్యర్ధుల మృతి కేసుపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం
Watch: పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Harish rao | రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తున్నది : హరీశ్ రావు