న్యూఢిల్లీ: పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఒక కోతి పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించింది. (monkey) ఎంపీల కోసం రిజర్వు చేసిన లాబీ లోపలకు అది వచ్చింది. ఎంపీలు కూర్చొనే సీటుపై ఆ కోతి కూర్చొంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శుక్రవారం మధ్యాహ్నం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. ఇంతలో కొత్త పార్లమెంట్ భవనంలోకి ఒక కోతి ప్రవేశించింది. ఎంపీల కోసం రిజర్వు చేసిన లాబీలోకి అది వచ్చింది. లాబీలో ఎంపీలు కూర్చొనే సీటుపై ఆ కోతి కూర్చొంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, పార్లమెంటు ప్రాంగణంలోకి కోతులు ప్రవేశించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. కోతుల నివారణకు పలు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. గత ఏడాది జీ20 సమ్మిట్ సందర్భంగా కోతులను భయపెట్టేందుకు గ్రే లంగూర్ కోతుల కటౌట్లను పలు చోట్ల ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.
#parliament2024
आज संसद में बंदर का आतंक दिखा।
MP lobby में दिए बंदर ने दर्शन। pic.twitter.com/3tQrmo6dBr— Aishwarya Paliwal (@AishPaliwal) August 2, 2024