Devara Movie | మరికొన్ని గంటల్లో టాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా దేవర ఫీవర్ మొదలవుతున్న విషయం తెలిసిందే. ఆరేండ్ల తర్వాత తమ అభిమాన హీరో సోలోగా వస్తుడటంతో అటు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ సినిమా ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో ఈ సినిమా రానుండటం.. అనిరుధ్ సంగీతం అందిస్తుడటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా.. హాట్ కేకుల్లా అమ్ముడయిపోయాయి. అయితే ఈ సినిమా ఎన్ని థియేటర్లలో అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 7000 లకుపైగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. దీంతో ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ రికార్డు అందుకున్న సినిమాగా దేవర నిలవబోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 10,200 థియేటర్లలో రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారు జామున 1.08 గంటలకు స్పెషల్ షోస్‌ను ఓవర్సీస్తో పాటు సమానంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు మేకర్స్.
Also Read..