Devara | గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఎంత ప్రొఫెషనల్‌గా ఉంటాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ నందమూరి హీరోతో యాక్టింగ్, డ్యాన్స్ లాంటి విషయాల్లో పోటీ పడటం అంటే అంత సులభమైన విషయమేమీ కాదు. తారక్ డ్యాన్స్ చేశాడంటే ఫ్లోర్ దద్దరిల్లాల్సిందే. ఇప్పటికే చుట్టుమల్లె సాంగ్ స్టైలిష్ స్టెప్పులతో అదరగొట్టేస్తున్న తారక్.. తాజాగా దేవర (Devara) సినిమా దావూదీ సాంగ్‌తో నెట్టింట హల్ చల్ చేస్తున్నాడు.
జాన్వీకపూర్, తారక్ మాస్ స్టైలిష్ డ్యాన్స్‌కు నెట్టింట ఫిదా అవుతున్నారు. సౌతిండియన్ ఇండస్ట్రీలోనే 24 గంటల్లో అత్యధిక మంది వీక్షించిన వీడియో సాంగ్ (18.7 మిలియన్లకుపైగా) ట్రెండింగ్‌లో నిలుస్తుంటే.. మరోవైపు ఈ సాంగ్‌లో తారక్ స్టెప్పులు కాపీ కొట్టారంటూ విజయ్ బీస్ట్ లోని హలమితి హబిబో స్టెప్పులు కాపీ చేశారంటూ నెట్టింట కామెంట్స్ దర్శనమిస్తున్నాయి. దావూదీ సాంగ్‌ను పాపులర్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశాడు. మరి ఈ కామెంట్స్ పై శేఖర్ మాస్టర్ ఏదైనా స్పందిస్తాడేమో చూడాలంటున్నారు నెటిజన్లు.
కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటిస్తుండగా.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Song ye anukunna
Steps kuda as it is dimparentra 😭😭
Pls eliminate Sekhar master I say, Dhee lo chusi copy kotti pette steps kuda aipoyay entayya😭😭😭#Devara #Daavudi pic.twitter.com/HE04B2JJjK
— Vamc Krishna (@lyf_a_zindagii) September 4, 2024
Tollywood Most Viewed Lyrical/Video Songs in 24 Hours#Daavudi – 18.60M
Dum Masala – 17.42M
Penny Song – 16.38M#Chuttamalle – 15.68M2/4 from #Devara. BLOCKBUSTER ALBUM @anirudhofficial 🔥🔥🔥🔥 pic.twitter.com/kNxHoZQN3a
— Vinay Gudapati (@gudapativinay) September 5, 2024
Thandel | జోష్ టు తండేల్.. నాగచైతన్య జర్నీకి ఎన్నేండ్లో తెలుసా..?
Samantha | మూవీ షూటింగ్లో గాయపడ్డ సమంత..! గాయాలు కాకుండా యాక్షన్ స్టార్‌ను కాగలనా? అంటూ పోస్ట్..!