Denzel Washington | హాలీవుడ్ దిగ్గజ నటుడు, రెండు సార్లు ఆస్కార్ విజేత డెంజెల్ వాషింగ్టన్ (Denzel Washington) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అమెరికన్ నటుడిగా ఎంట్రీ ఇచ్చి హాలీవుడ్లో తనకంటూ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా నాలుగు దశాబ్దాల నుంచి ప్రేక్షకులను అలరిస్తువస్తున్నాడు.
ఇక తాను నటించిన ‘ఈక్వలైజర్ ట్రయోలజీ’, ‘మ్యాన్ ఆన్ ఫైర్’, ‘అమెరికన్ గ్యాంగ్‌స్టర్’, ‘మాల్కం X’ వంటి చిత్రాలు హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) కూడా డెంజెల్ వాషింగ్టన్కు డై హార్డ్ ఫ్యాన్ అంటే అర్థం చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా అతడికి ఎంత ఫాలోయింగ్ ఉందని. ఇక 2020లో అతడిని న్యూయార్క్ టైమ్స్ పత్రిక 21వ శతాబ్దపు గొప్ప నటుడిగా పేర్కొంది. ఇదిలావుంటే.. డెంజెల్ తాజాగా నటిస్తున్న చిత్రం గ్లాడియేటర్ 2 (Gladiator II). రిడ్లీ స్కాట్ (Ridley Scott) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు డెంజెల్.
తన రిటైర్మెంట్ గురించి ఎంపైర్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ.. ”ఇప్పుడు నాకు 70 ఏండ్లు నాకు ఆసక్తి ఉన్న సినిమాలు చేయడానికి చాలా తక్కువ చిత్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. నేను నా దర్శకుడిని చూసి ప్రేరణ పొందాలి. నా దర్శకుడు రిడ్లీ స్కాట్ ఇప్పుడు 86 సంవత్సరాలు. 86 వయసులో కూడా గ్లాడియేటర్ 2 వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆయనను చూసి ప్రేరణ పొందాలి అనుకుంటున్నాను అంటూ చెప్పుకోచ్చాడు.
Also read..