CSTEP | దేశంలోని 76 నగరాల్లో వాయు కాలుష్యంపై సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (CSTEP) కీలక అధ్యయనం నిర్వహించింది. ఇందులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ నిర్దేశించిన లక్ష్యాల్లో కొన్ని నగరాలు మాత్రమే రాబోయే కాలంలో టార్గెట్‌ను అందుకునే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. 2019లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేని 131 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడమే దీని లక్ష్యం. 2030 నాటికి కేవలం ఎనిమిది నగరాలు మాత్రమే ఉద్గారాలను 40శాతం తగ్గించగలవని రెండున్నళ్ల పాటు నిర్వహించి అధ్యయనంలో తేలింది. అంతేకాదు 2019తో పోలిస్తే 2030 నాటికి ఆయా నగరాల్లో ఉద్గారాలు 11 నుంచి 45శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా నగరాల్లో గాలి నాణ్యత పీఎం 10, పీఎం 2.5, ఎస్ఓ2, ఎన్ఓ ఎక్స్ అనే నాలుగు నిర్దిష్య కాలుష్య కారకాలను దృష్టిలో పెట్టుకొని అధ్యయనం నిర్వహించారు.
2019ని బేస్ ఇయర్‌గా తీసుకొని 2030 నాటికి కాలుష్య కారకాలు ఎంత వరకు పెరుగుతాయి ? లేదా తగ్గుతాయో తెలుసుకునేందుకు అధ్యయనం ప్రయత్నించింది. అధ్యయనం ఫలితాల్లో 70శాతం కంటే ఎక్కువ నగరాల్లో రవాణా, దేశీయ ఇంధన వినియోగ సర్వేలకు వ్యతిరేకంగా ధ్రువీకరించబడ్డాయి. ఆయా నగరాల్లో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు సరైన ప్రణాళిక రూపొందించకపోతే 2030 నాటికి అత్యంత హానికమైన వాయు కాలుష్య కారకమైన పీఎం 2.5 పరిమాణం పెరుగుతుందని అధ్యయనం పేర్కొంది. వాయు కాలుష్యం తగ్గించేందుకు పరిశ్రమలు, రవాణా, నిర్మాణం, వ్యర్థాలను బహిరంగంగా కాల్చివేతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని.. తద్వారా నేషనల్ క్లీన్ ప్రోగ్రామ్ లక్ష్యాలను సాధింవచ్చని అధ్యయనం స్పష్టం చేసింది. బెంగళూరులో సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ నిర్వహించనున్న ఇండియన్ క్లీన్ ఎయిర్ సమ్మిట్ 6వ ఎడిషన్‌లో అధ్యయనం ఫలితాలకు సంబంధించిన విజువలైజేషన్ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు.