బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Sharukh Khan) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి పఠాన్ (Pathaan). సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. జాన్ అబ్రహాం కీ రోల్ పోషిస్తున్నాడు. కాగా మోస్ట్ ఎవెయిటెడ్ సినిమా గురించి అప్డేట్ ఇచ్చింది దీపికా పదుకొనే (Deepika Padukone) . డబ్బింగ్ స్టూడియోలో మైక్ కింద స్క్రిప్ట్ ఉన్న స్టిల్‌ను షేర్ చేస్తూ..పనులు కొనసాగుతున్నవి..అనే క్యాప్షన్ ఇచ్చింది దీపికా. ఈ పోస్టుతో సినిమా డబ్బింగ్ పనులు కొనసాగుతున్నవని తెలిసిపోతుంది.
దీపికా పదుకొనే తాజా పోస్టుతో త్వరలోనే మేకర్స్ మూవీ లవర్స్‌కు అదిరిపోయే ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని అర్థమవుతుంది. ఇప్పటికే దీపికా పదుకొనే పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందన వస్తోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది పఠాన్. 2023 జనవరి 25న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. షారుఖ్ ఖాన్ ఇటీవలే రిలీజైన మల్టీస్టారర్ ప్రాజెక్టు బ్రహ్మాస్త్ర సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో షారుక్ పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
షారుఖ్ ఖాన్ దీంతోపాటు జవాన్, డుంకీ సినిమాల్లో నటిస్తున్నాడు. దీపికా పదుకొనే మరోవైపు ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ప్రాజెక్టు కేలో కూడా నటిస్తోంది. దీపికా-షారుక్ కాంబినేషన్లో వచ్చిన ఓం శాంతి ఓం,చెన్నై ఎక్స్‌ప్రెస్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఈ ఇద్దరూ పఠాన్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.