పార్టీ వెకేషన్లో కానీ, హ్యాపీ మూడ్‌లో ఉన్నపుడు కానీ, లేదంటే ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో డ్యాన్స్ చేయడం సహజమే. కానీ ఒకే చేయిపై శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ..కాళ్లను కంటిన్యూగా రౌండప్ చేస్తూ డ్యాన్స్ చేయడమంటే అంత సులభమైన విషయమేం కాదు. అలాంటి రిస్కీ డ్యాన్స్ (breaking moves)ను హైదరాబాదీ బ్రేకర్ డేవిడ్ జెరోమ్ జావియర్ (David Jerome Xavier) చేసి ఔరా అనిపించాడు. రిస్కీ డ్యాన్స్ ఫీట్ విజయవంతంగా చేసేందుకు జెరోమ్ ఏడాదిన్నర కాలంగా ప్రాక్టీస్ చేయడం గమనార్హం.
బ్రేక్ డ్యాన్స్ అనేది రెగ్యులర్ డ్యాన్స్ కు భిన్నంగా ఉంటుంది. ‘బ్రేక్ డ్యాన్సింగ్ ‘ను ‘బ్రేకింగ్ ‘ అని కూడా పిలుస్తుంటారు. ఈ డ్యాన్స్ చేసే వారిని ‘బ్రేకర్స్’అని..‘B-boy’ లేదా ‘B-girl’ అని పరిగణిస్తుంటారు. ప్రతీ పర్ ఫార్మర్కు వేర్వేరు స్టేజ్ నేమ్ ఉన్నట్టే జెరోమ్‌ను అందరూ ‘బి-బాయ్ షాడో’ (B-boy Shadow) అని పిలుస్తారు. ‘షాడో’ అనే పదం జెరోమ్‌కు చాలా ఇష్టమైన పాట అయిన బిగిన్ బై నార్వేజియన్ మ్యూజికల్ ద్వయం -మాడ్కాన్లోని సాహిత్యం నుంచి తీసుకున్నారు.
YouTube నుండి నేర్చుకున్నా..
ఇక ఛాలెంజింగ్‌గా కనిపించే ఈ మూమెంట్స్ ను చూసినప్పుడు, 70లలో పాపులర్ అయిన ఈ నృత్యం రెగ్యులర్ డ్యాన్స్ కంటే ఎక్కువని మీకు అనిపించవచ్చు. జెరోమ్ హైదరాబాద్‌లోని ఫస్ట్ బ్రేకింగ్ క్రూలో సభ్యుడిగా చేరాడు. క్రూ తరుపున వివిధ రకాల ఈవెంట్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అప్పట్లో నాకు సరైన గైడెన్స్ లేదు. YouTube నుండి ఈ డ్యాన్స్ మూమెంట్స్ నేర్చుకున్నా. ఆ తర్వాత నా తోటి క్రూ టీం నుండి కూడా నేర్చుకున్నానన్నాడు.
హైదరాబాద్‌లో డ్యాన్సింగ్ కమ్యూనిటీ చిన్నది..చాలా తక్కువ బ్రేకర్లే ఉంటారు. ఇతర నగరాల్లో సుమారు 100-150 మంది బ్రేకర్లు ఉంటే, హైదరాబాద్‌లో కేవలం 20-40 మాత్రమే ఉన్నారని జెరోమ్ చెప్పుకొచ్చాడు. ‘బ్రేకింగ్ మూవ్స్’ అనేది అంత సులభమైన నృత్య రూపం కాదని, దీన్ని నేర్చుకోవాలనుకునే చాలా మంది మధ్యలోనే వదిలేస్తారని చెప్పాడు జెరోమ్.