Dasara | కరీంనగర్లో ‘దసరా’ సక్సెస్ ఈవెంట్.. హాజరైన మంత్రి గంగుల
Dasara | కరీంనగర్ పట్టణంలో ‘దసరా’ సినిమా సక్సెస్ ఈవెంట్ జరిగింది. హీరో నానితో పాటు చిత్ర యూనిట్ హాజరైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్రహ్మోత్సవాలకు, కళోత్సవాలకు, విజయోత్సవాలకు వేదికగా కరీంనగర్ మారిందన్నారు.
Dasara | కరీంనగర్ పట్టణంలో ‘దసరా’ సినిమా సక్సెస్ ఈవెంట్ జరిగింది. హీరో నానితో పాటు చిత్ర యూనిట్ హాజరైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్రహ్మోత్సవాలకు, కళోత్సవాలకు, విజయోత్సవాలకు వేదికగా కరీంనగర్ మారిందన్నారు. మానేరు నీళ్లలోనే ఒక పవర్ ఉందని, తెలంగాణ సంస్కృతిలో ఒక గొప్పదనం ఉందన్నారు. మానేరు నీళ్లు తాగిన మా సిరిసిల్ల బిడ్డ వేణు ‘బలగం’తో, పెద్దపల్లి బిడ్డ శ్రీకాంత్ ఓదెల ‘దసరా’తో కరీంనగర్ సత్తా చాటారన్నారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించడం వల్లే మట్టిలోని మాణిక్యాలు బయటకు వస్తున్నాయన్నారు. కాసర్ల శ్యామ్ గొప్ప పాటలు రాస్తూ తెలంగాణ సంస్కృతికి ఎలుగెత్తి చాటుతున్నారన్నారు. నాని ఎక్కడ పుట్టినా దసరా సినిమా తర్వాత మా తెలంగాణ బిడ్డయ్యాడని, గతంలో తెలంగాణ భాష గుండాలకు పెట్టారని.. నేడు తెలంగాణ భాష లేకపోతే సినిమాలే లేని పరిస్థితికి వచ్చిందన్నారు. తెలంగాణ భాషతో సినిమా తీస్తే సూపర్ హిట్ అనేది సినిమా ఇండస్ట్రీలో స్థిరపడడం శుభపరిణామం అన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న పైడి జయరాజ్, జ్ఞానపీఠ్ అవార్డు పొందిన సినారె ఇలా నాటితరం నుంచి నేటితరం వరకూ సినిమాకు ఆయువుపట్టుగా కరీంనగర్ నిలుస్తూనే ఉందన్నారు. దసరా యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో నాని మాట్లాడుతూ కరీంనగర్ ఎనర్జీ అద్భుతంగా ఉందన్నారు. ఈవెంట్ సక్సెస్కు సహకరించిన మంత్రి గంగుల కమలాకర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్లో అద్భుతమైన అభివృద్ధితో పాటు ప్రకృతి రమణీయత ఆకట్టుకుంటుందని, త్వరలోనే ఇక్కడ షూటింగ్ కోసం ప్లాన్ చేస్తానన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

