Daaku Maharaaj | నందమూరి బాలకృష్ణ (Balakrishna) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం డాకు మహారాజ్ (Daaku Maharaaj). ఎన్బీకే 109 (NBK109)గా తెరకెక్కుతున్న ఈ మూవీకి బాబీ (Bobby) దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. కాగా మేకర్స్ క్రిస్మస్ కానుకగా స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమాలోని లీడ్ క్యారెక్టర్లను పరిచయం చేశాడు.
బాలకృష్ణ ఓ వైపు గండ్రగొడ్డలి చేతబట్టి కనిపిస్తుండగా.. మరోవైపు ఊర్వశి రౌటేలా పిస్తోల్ పట్టుకుంది. బాబీడియోల్, ప్రగ్యాజైశ్వాల్, శ్రద్దాశ్రీనాథ్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో హింట్ ఇచ్చేశాడు. తాజా లుక్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
ఇప్పటికే విడుదల చేసిన హై ఎనర్జిటిక్ FIERCE Track నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. బాబీ డియోల్ విలన్గా నటిస్తున్నాడు. ప్రగ్యాజైశ్వాల్, చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
టెక్సాస్లోని డల్లాస్లో 2025 జనవరి 4న Texas Trust CU Theatreలో సాయంత్రం 6 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.
Team #DaakuMaharaaj wishes you all a very #MerryChristmas 🎄🎅
Grand Release Worldwide at Cinemas Near you from Jan 12, 2025. 🔥
𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna pic.twitter.com/RXlz0rqHpj
— BA Raju’s Team (@baraju_SuperHit) December 25, 2024
Allu Aravind | శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం : అల్లు అరవింద్
Dil Raju | కిమ్స్ ఆస్పత్రికి దిల్ రాజు, అల్లు అరవింద్
Drishyam 3 | క్లాసిక్ క్రిమినల్ కమ్ బ్యాక్.. దృశ్యం 3పై మోహన్ లాల్ క్లారిటీ