Daaku Maharaaj | సింహా సినిమాలో దబిడి దిబిడే అంటూ నందమూరి బాలకృష్ణ (Balakrishna) చెప్పే డైలాగ్ ఏ రేంజ్లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడిదే డైలాగ్‌ను పాటగా మార్చేసి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం డాకు మహారాజ్ (Daaku Maharaaj). ఎన్బీకే 109 (NBK109)గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాబీ (Bobby) దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం.
తాజాగా డాకు మహారాజ్ థర్డ్ సింగిల్ దబిడి దిబిడి సాంగ్‌ను ఇవాళ సాయంత్రం 5:16 గంటలకు లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సాంగ్ లుక్ విడుదల చేశారు. అన్‌స్టాపబుల్ మాస్ బ్లాస్ట్ సాంగ్‌లో బాలకృష్ణ, ఊర్వశి రౌటేలా స్టైలిష్ మాస్ డ్యాన్స్ ఉండబోతున్నట్టు లుక్ చెప్పకనే చెబుతోంది. ఇప్పటికే లాంచ్ చేసిన హై ఎనర్జిటిక్ FIERCE Track నెట్టింట సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తుండగా.. ప్రగ్యాజైశ్వాల్, చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా టెక్సాస్‌లోని డల్లాస్‌లో జనవరి 4న Texas Trust CU Theatreలో సాయంత్రం 6 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనున్న విషయం తెలిసిందే.
The time is locked for an unstoppable MASS BLAST! 💥💥🤙🏻🤙🏻#DaakuMaharaaj 𝟑𝐫𝐝 𝐒𝐢𝐧𝐠𝐥𝐞 ~ #DabidiDibidi will be out today at 5:16PM 🔥
A @MusicThaman Vibe 🥁
A @dirbobby Film 💥In Cinemas Worldwide from Jan 12, 2025. 🔥
𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna pic.twitter.com/PWS84f73NW
— BA Raju’s Team (@baraju_SuperHit) January 2, 2025
డాకు మహారాజ్ టైటిల్ టీజర్..
SSMB 29 | అడ్వెంచర్‌కు అంతా సిద్ధం.. నేడు రాజమౌళి, మహేష్ సినిమాకు కొబ్బరికాయ!