టాలీవుడ్ (Tollywood)లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజౌమళి (SS Rajamouli) డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన దోస్తి, నాటు నాటు పాటలకు అద్బుతమైన స్పందన వస్తోంది. తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ అందించారు. ఆర్ఆర్ఆర్ ఆంథెమ్ సాంగ్ జననీని నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. బావోద్వేగపూరిత అనుభవాన్నిఅందించేందుకు రెడీ..అంటూ మేకర్స్ ట్విటర్ ద్వారా తెలియజేశారు.
ఆర్ఆర్ఆర్ను 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్లో అల్లూరి సీతారామరాజు రోల్లో రాంచరణ్ (Ramcharan) నటిస్తుండగా..కొమ్రంభీం పాత్రలో ఎన్టీఆర్ (Jr NTR) కనిపించనున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ సీత పాత్ర పోషిస్తుండగా.., హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మొర్రీస్ ఎన్టీఆర్‌కు జోడీగా నటించనుంది. బాలీవుడ్ హీరో అజయ్‌దేవ్‌గన్, సముద్రఖని, శ్రియా శరణ్ ఈ చిత్రంలో ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన నాటు నాటు సాంగ్ ఊరమాస్‌గా సాగుతూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. మరోవైపు ఈ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంటోంది.
#RRRSoulAnthem, #Janani will be out on November 26th. Gear up for an emotionally captivating experience. #RRRMovie @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @mmkeeravaani @DVVMovies @RRRMovie@LahariMusic @TSeries pic.twitter.com/Rh8yRnVRDN
— BA Raju's Team (@baraju_SuperHit) November 22, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ranbir Alia wedding| రణ్‌బీర్‌కపూర్-అలియా పెళ్లిపై తాజా అప్డేట్..!
Thaman AKhanda Update | అఖండపై థమన్ ఇచ్చిన క్రేజీ అప్ డేట్ ఎంటో తెలుసా..?
Pooja Kannan Debut Film | సాయిపల్లవి సోదరి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది
Akhanda Musical Roar | అఖండ ‘గర్జన’ కేక..టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో