టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న చిత్రాల్లో మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ సలార్ (Salaar). కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టోరీతో వస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోండగా.. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా సలార్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని సలార్ ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌ను కూడా రెడీ చేస్తున్నారట మేకర్స్. అయితే ఇంగ్లీష్ వెర్షన్లో కామెడీ సన్నివేశాలు, పాటలు ఉండవన్న వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ లెక్కన సలార్ తెలుగు వెర్షన్ రన్ టైం 2 గంటల 15 నిమిషాలు.. కాగా ఇంగ్లీష్ వెర్షన్ రన్ టైం 2 గంటల కంటే తక్కువే ఉండనుందన్నమాట. సలార్ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సలార్ రెండు పార్టులుగా రాబోతుందని తెలిసిందే. సలార్ సీక్వెల్ పార్టు ప్రాజెక్ట్ K తర్వాతే విడుదల కానుందని ఇన్ సైడ్ టాక్.
కేజీఎఫ్ ప్రాంఛైజీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలిమ్స్ పై తెరకెక్కుతుండటంతో సలార్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో నటిస్తున్న ప్రాజెక్ట్ K, మారుతి డైరెక్ట్ చేస్తున్న హార్రర్ కామెడీ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో మైథలాజికల్ ప్రాజెక్ట్ ఆదిపురుష్‌లో కూడా నటిస్తున్నాడు ప్రభాస్.
Ponniyin Selvan 2 | విక్రమ్ ఆదిత్య కరికాలన్‌గా మారాడిలా.. పొన్నియన్ సెల్వన్ 2 ట్రైలర్ అప్డేట్
Pawan Kalyan | ఏప్రిల్‌లో ఫుల్ బిజీగా పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్ లో జోష్