హాస్య నటుడు సత్య నటిస్తున్న తాజా చిత్రానికి ‘జెట్లీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని శుక్రవారం విడుదల చేశారు. ఇందులో సత్య ఓ విమానంపై కూర్చొని కనిపిస్తున్నారు. ‘ఐయామ్ డన్ విత్ కామెడీ’ అనే క్యాప్షన్ కథలోని వినోదాన్ని సూచిస్తున్నది.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నదని, హైవోల్టేజ్ హ్యూమర్, థ్రిల్స్, ట్విస్టులతో ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరిస్తుందని, సత్య పాత్ర నవ్వుల్ని పంచుతుందని మేకర్స్ తెలిపారు. రియాసింఘా, వెన్నెల కిషోర్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్మెంట్, చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సమర్పిస్తున్నది.