Comedian Ali | టాలీవుడ్లో కమెడియన్‌గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు అలీ (Ali ) ఒకరు. బాల నటుడిగా తన కెరీర్ ప్రారంభించి తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో తన కామెడీ ద్వారా ప్రేక్షకులను నవ్వించి మెప్పించారు. అయితే ఈ నటుడు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండి వైసీపీలో చేరి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక రాజకీయాల్లో ఉన్నప్పుడే తన ప్రాణ స్నేహితుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీదా కూడా విమర్శలు గుప్పించాడు.
అలీ వైసీపీలో చేరినందుకు ఒకసారి పవన్ కళ్యాణ్ అలీ గురించి ఘాటుగా విమర్శలు గుప్పించగా.. అలీ అంతకు మించి స్వయంకృషితో నేను పైకొచ్చాను తప్ప నీలా చిరంజీవి వేసిన బాటలో రాలేదంటూ కౌంటరిచ్చారు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతూ వచ్చింది. అయితే ఏపీ ఎలక్షన్స్‌లో వైసీపీ ఓడిపోయిన అనంతరం అలీ రాజకీయలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ముఖ్యంగా మళ్లీ తనకు నచ్చిన ఫీల్డ్‌లో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నటించిన బడ్డీ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. అల్లు శీరిష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 02న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ నిర్వహించగా.. ఈ ఈవెంట్లో శీరిష్‌తో పాటు అలీ పాల్గోన్నాడు.
అయితే ఈ వేడుకలో ఒక రిపోర్టర్ అలీని అడుగుతూ.. మీరు సినిమా ప్రమోషన్స్‌లో తప్ప బయట నార్మల్‌గా కనిపించరు. మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాం ప్రేక్షకుల తరపున.. మీరు పాలిటిక్స్‌లోకి మళ్లీ వెళతారా.. ప్రస్తుతం పాలిటిక్స్‌లో మీ పోజిషన్ ఏంటి అని అడుగగా.. అలీ సమాధానమిస్తూ.. నేను ఇప్పుడు ఏ పోజిషన్లో లేను.. ప్రస్తుతం రాజకీయల నుంచి చాలా దూరంగా వచ్చాను. అటువైపు వెళ్లాలి అనుకోట్లేదు. అంటూ అలీ చెప్పుకోచ్చాడు.
ఇక మూవీ గురించి మాట్లాడుతూ.. అల్లు శీరిష్ ఎప్పుడు తాను ఒక స్టార్ హీరో తమ్ముడని బిహేవ్ చేయలేదని. నాతో చాలా గౌరవంగా ఉండేవాడు. ఎప్పుడు బడ్డీ సినిమా గురించే మాట్లాడుకునేవాళ్లం. ఇది మా సెకండ్ కాంబినేషన్. ఈ మూవీ కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాం అంటూ అలీ వెల్లడించాడు.
Also read..
తల్లి కాంగ్రెస్.. పిల్ల కాంగ్రెస్‌లు కలిసి ఏపీని సర్వనాశనం చేశాయి.. బీజేపీ నేత సెటైర్లు
bhagyashri borse | ఇక చాలు ఆపండి.. ఆ హీరోయిన్‌కి దిష్టి తగులుతుంది