bhagyashri borse | తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది కథానాయికలు వచ్చారు.. అయితే ఇందులో సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ రన్ చేసే కథానాయికలు తక్కువే అని చెప్పాలి. కొందరికి టాలెంట్ లేకపోయినా అదృష్టం కలిసొచ్చి టాప్ కథానాయికల జాబితాలో చేరిపోతారు. మరికొంత మంది టాలెంట్ వున్న వారికి ఆవగింజ అంత అదృష్టం కూడా లేకపోవడంతో కొన్ని సినిమాలు చేసి కెరీర్‌కు ముగింపు చెప్పేస్తారు. అయితే ఇక్కడ అందంతో పాటు అభినయం కలిగిన కథానాయికలు కోట్లల్లో పారితోషికం తీసుకున్న వాళ్లు కూడా లేకపోలేదు.
అయితే తాజాగా అందరి దృష్టి మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మీద పడింది. మాస్ కథానాయకుడు రవితేజ, డైరెక్టర్ హరీష్‌శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న మాస్ ఎంటర్టైనర్ మిస్టర్ బచ్చన్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం నుంచి ఏ ప్రమోషన్ కంటెంట్ రిలీజ్ చేసినా ఈ చిత్ర హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఆమె డ్యాన్సులు, అందం కుర్రకారుని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన మిస్టర్ బచ్చన్ టీజర్ రిలీజ్ వేడుకలో ఆమె స్టేజిపై వేసిన డ్యాన్స్ మూమెంట్స్ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టాయి.
అంతేకాదు ఈ సినిమాలో ఆమె డ్యాన్స్ స్టెప్స్ కూడా అదనపు ఆకర్షణగా నిలువనున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సితార్, రెప్పల్ డప్పుల్ సాంగ్స్, టీజర్ లో తన బ్యూటీఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు భాగ్యశ్రీ. ఇప్పుడు ఎక్కడ చూసిన భాగ్యశ్రీ ఫోటోలే వైరల్ అవుతున్నాయి. ఆమెను టాలీవుడ్ అప్ కమింగ్ క్రేజీ హీరోయిన్ అంటున్నారు. భాగ్యశ్రీ పెర్ఫార్మెన్స్ ని బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం తన పాత్రకు ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. అయితే ఈ కథానాయికపై అప్పుడే అన్ని అంచనాలు పెంచేస్తూ.. భాగ్యశ్రీ బోర్సే మీద భారం మోపుతున్నారు. అయితే కొంత మంది మాత్రం సినిమా విడుదల వరకు ఆగండి.. ఆమె పర్పార్మెన్స్ డ్యాన్స్ స్టెప్స్ చూసి ఆమెను ఆకాశానికి ఎత్తుందాం.. అంతేకాని ముందునుంచే అంచనాలు పెంచేసి. .ఆమె అందాన్ని అంతలా పొగిడితే ఆమెకు దిష్టి తగిలేయదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..
Sudhanshu Trivedi | కులంపై రాజీవ్, ఇందిరా గాంధీల మాటలను విస్మరించిన రాహుల్ గాంధీ : బీజేపీ
Nitin Gadkari | జీవిత, వైద్య బీమా పథకాలపై జీఎస్టీ వద్దు.. నిర్మలా సీతారామన్‌కు నితిన్ గడ్కరీ లేఖ
Wayanad landslide | వయనాద్ విషాదంపై తక్షణ చర్చకు కాంగ్రెస్ పట్టు