Wayanad landslide : వయనాద్ ఉదంతం మాటలకందని విషాదమని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో శిధిలాల నుంచి పలువురి మృతదేహాలు బయటపడ్డాయని, మరి కొందరి జాడ గల్లంతయిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరింత సాయం అందాలని, సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మానవతా దృక్పథంతో సాయం అందించాలని కోరారు.
ఇవన్నీ వేగంగా చేయగలిగితే పరిస్ధితి కొంత మెరుగుపడుతుందని అన్నారు. వయనాద్ విషాదంతో దేశం యావత్తూ చలించిపోయిందని, ఈ తరహా విపత్తులను నిలువరించేందుకు మనం దీర్ఘకాల, స్వల్పకాలిక వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని కేసీ వేణుగోపాల్ అన్నారు. ఈ అంశంపై తక్షణ చర్చకు తాను స్పీకర్‌కు నోటీసులు ఇచ్చానని చెప్పారు. కాగా, కేరళ (Kerala) రాష్ట్రం వయనాడ్ (Wayanad)లో మృత్యుఘోష కొనసాగుతోంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ఇప్పటి వరకూ అందిన తాజా సమాచారం ప్రకారం.. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 163 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 143 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైంది. 32 మృతదేహాలను అధికారులు బాధిత కుటుంబాలకు అందజేశారు. సుమారు 78 మృతదేహాలను మెప్పాడి సోషల్ హెల్త్ సెంటర్లో పెట్టారు. మరో 32 మంది మృతదేహాలను నీలంబుర్ జిల్లా ఆస్పత్రిలో ఉంచారు. ఇక ఈ ఘటనలో 91 మంది మిస్సింగ్ కాగా, 191 మంది ఆస్పత్రి పాలయ్యారు. వయనాడ్‌లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు
Read More :
Manipur Governor | మణిపూర్ గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం.. Video