Allu Arjun | టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని.. చట్టం ముందు అందరూ సమానులేనన్నారు. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందన్నారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని.. మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయన్నారు. ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్లో పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా వచ్చారు. ఆ సమయంలోనే ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో రేవతి అనే మహిళ మృతి చెందింది.
ఆమె కుమారుడు గాయాలకు గురయ్యాడు. ఘటనలో మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్‌తోపాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ముగ్గురిని అరెస్టు చేశారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌పై బీఎన్ఎస్ 118 (1), బీఎన్ఎస్ 105, రెడ్‌విత్ 3/5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. రేవతి మృతిపై అల్లు అర్జున్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు ఆమె కుటుంబానికి రూ.25లక్షల సాయం ప్రకటించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు అనంతరం గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు చేశారు. ఆ తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరుచనున్నారు. మరో వైపు పుష్ప స్టార్ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.